తెలుగు సినిమా హీరోయిన్ ల పారితోషకం .

తెలుగు చిత్ర పరిశ్రమ పేరు బాహుబలి సినిమా విజయం తో ప్రపంచం మొత్తం మారు మోగింది . బాహుబలి రెండు సినిమాలు విజయం తో ప్రతి ఒక్కరి కన్ను టాలీవుడ్ సినిమాల బడ్జెట్ మరియు వసూళ్ల పై పడింది. తెలుగు సినిమా ల బడ్జెట్ ఈమధ్య బాగా పెరిగింది. తెలుగు సినిమాలు కూడా బాలీవుడ్ సినిమాల కన్నా ఎక్కువ కలెక్షన్ సాధిస్తున్న ఎప్పుడు హీరోయిన్స్ కి కూడా నిర్మాతలు భారీగా పారితోషకం ఇస్తున్నారు. ఇప్పుడు మనం మన తెలుగు సినిమా పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న నటీమణుల గురించి తెలుసు కుందాం .

బహుబలి సినిమా లో నటించిన అనుష్క ఒక్క సినిమా కి దాదాపు 4 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటుంది . అనుష్క ఇప్పటికే హీరోయిన్ నటించిన అరుంధతి,రుద్రమ దేవి లాంటి సినిమా లను పెద్ద హీరోలు లేకుండానే మంచి కలెక్షన్స్ సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్నాయి. అందుకే నిర్మాతలు సినిమా ను బట్టి అనుష్క కి అత్యధిక పారితోషకం ఇవ్వడానికి వెనకాడడం లేదు.

సమంత పెళ్లి కాక ముందు ఒప్పుకున్నా మరియు చేసిన సినిమాల కి దాదాపు 2.5 కోట్ల వరకు పారితోషకం అందుకుంది.సమంత దాదాపు జోరుమీదున్న కుర్ర హీరోలతో నటించింది . అటు హీరో తో పాటు ఇటు సమంత గ్లామర్ సినిమా ను నడిపిస్తాయని నిర్మాతలు మంచి పారితోషకం ఇస్తున్నారు. పెళ్లి తర్వాత సమంత మార్కెట్ ఎలా ఉంటుందో వేచి చూడాలి .

కాజల్ అగర్వాల్ ప్రతి సినిమా కి దాదాపు 2 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటుంది. దాదాపు అందరి యువ హీరో లతో నటించిన అనుభవం కాజల్ కి సొంతం. అటు బాలీవుడ్ లో తన అదృష్టం పరిక్షించు కోవడానికి కొన్ని సినిమాలలో నటించింది.

తమన్నా కూడా ప్రతి సినిమా కి దాదాపు 2 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటుంది.బాహుబలి సినిమా తర్వాత తమన్నా సరియైన అవకాశాలు లేక అటు హిందీ,తమిళ భాషల్లో కూడా నటించడానికి ఒప్పుకుంటుంది .

రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గ ప్రతి సినిమా కి 1.5 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటుంది. రకుల్ చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా దూసుకు పోతుండడం తో ఎక్కువ మంది యువ హీరోలు ఆమెతో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: