ఎయిడ్స్ వ్యాధితో మరణించిన సెలబ్రిటీస్.

ప్రపంచంలో అది భయంకర వ్యాధి ఎయిడ్స్ . ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లెక్కల ప్రకారం 2015 సంవత్సరం చివర నాటికీ ప్రపంచం లో 3. 67 మంది ఎయిడ్స్ తో వ్యాధి తో బాధపడుతున్నారు . చాల మందికి వాళ్ళకు తెలియ కుండా చిన్న చిన్న అజాగ్రత వల్ల ఎయిడ్స్ వ్యాధి బారిన పడుతున్నారు . ఎయిడ్స్ వ్యాధి బారిన పడ్డవారిలో ఇటు సెలబ్రిటీస్ నుండి సామాన్య మనుషులు వరకు అందరు ఉన్నారు . ఇప్పుడు మనం ప్రపంచం వ్యాప్తంగా ఎయిడ్స్ వ్యాధి బారిన పడ్డ సెలబ్రిటీస్ గురించి తెలుసు కుందాం .

సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమలో ఒక్కపుడు హీరోయిన్ గ నటించిన నిషా నూర్ . అప్పట్లో కమల్ హాసన్,రజిని కాంత్ లాంటి హీరోలతో కలిసి నటించింది. చాల కొద్దీ కాలమే అంటే దాదాపు 6 నుండి 7 సంవత్సరాలు మాత్రమే సినిమా లో నటించింది. సినిమాల్లో తగినంత అవకాశాలు రాక డబ్బు సంపాదన కోసం అడ్డదారులు తొక్కడం ద్వారా ఈ హీరోయిన్ చివరకు ఎయిడ్స్ వ్యాధి భారిన పడి మరణించింది .

ప్రముఖ మోడల్ జియా కెరన్గ్ ఒక్కపుడు అమెరికాలో 1970-80 సంవత్సరాలలో సూపర్ మోడల్ గా మంచి పేరు సంపాందించుకుంది. కాస్మోపాలిటన్,వోగ్ లాంటి ఫాషన్ మ్యాగజిన్ లలో తన అందం తో అభిమానులకు మరింత దగ్గరయ్యింది . డ్రగ్స్ కు బానిస అయినా జియా అనారోగ్యపు అలవాట్ల వలన ఎయిడ్స్ వ్యాధి బారిన పడి కేవలం 26 సంవత్సరాలకే చని పోయింది.

అమెరికా ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాడు అర్థుర్ ఆష్ మూడు సార్లు గ్రాండ్ స్లాం టైటిల్ సాధించాడు . వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తనకు బైపాస్ సర్జరీ సమయంలో ఎయిడ్స్ వ్యాధి కలిగిన రక్తం ఎక్కించడం వలన ఈ వ్యాధిన పడి 1993 మరణించాడు. తాను ఎయిడ్స్ వ్యాధిని పడ్డాక ఎయిడ్స్ వ్యాధిని అందరికి తెలిసేలాగా విస్తృతంగా ప్రచారం చేశాడు.

హాలీవుడ్ నటుడు రాక్ హడ్సన్ తన నటనకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. సినిమాలు మానేసాక బుల్లి తెర వ్యాక్యతగా దశాబ్దం పాటు ప్రేక్షకులను అలరించాడు. 1985 లో ఎయిడ్స్ వ్యాధి తో మరణించాడు .

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: