ఒకప్పటి హీరోయిన్ మాధవి ఇప్పుడు ఎం చేస్తుంది.

చిరంజీవి ఖైదీ సినిమా లో “రగులు తోంది మొదలుపొద ” అంటూ వచ్చిన పాము సాంగ్ అందరికి గుర్తుంది కదా ,ఆపాటలో నటించిన హీరోయిన్ మాధవి గురించి ఆసక్తికరమైన విషయాలు మీ కోసం.

హీరోయిన్ మాధవి అసలు పేరు విజయ లక్ష్మి.మాధవి సెప్టెంబర్ 14 1962 లో మన హైదరాబాద్ లో జన్మించింది. తెలుగు ,తమిళ్ ,కన్నడ,మలయాళం,ఒరియా మరియు హిందీ సినిమాల్లో దాదాపు 300 కు పైగా సినిమా లో నటించింది. తన 17 సంవత్సరాల సినిమా ప్రయాణం లో ఎన్నో విభిన్నా పాత్రలతో ప్రేక్షకులను అలరించింది.

మాధవి సినిమా లకు రాక ముందు దాదాపు 1000 పైగా భరత నాట్యం మరియు ఫోక్ డాన్స్ ప్రదర్శనలు ఇచ్చింది .తెలుగు లో దర్శక రత్న దాసరి నారాయణ్ రావు సినిమా తూర్పు పడమర సినిమా ద్వారా వెండి తెరకు పరిచయం అయ్యింది . మాధవి తన 17 సంవత్సరాల నటజీవితం తర్వాత 1996 వ సంవత్సరం లో ఇండో జర్మన్ వ్యాపారవేత్త మరియు వేళ్ళ కోట్లా ఆస్తి పరుడైన రాల్ఫ్ శర్మ ని వివాహం చేసుకుంది. మాధవి ఇప్పుడున్న సినిమా హీరోయిన్స్ లో అత్యధిక ధనవంతురాలనే అని చెప్పాలి. ప్రస్తుతం మాధవి తన భర్త మరియు తన ముగ్గురు ఆడ పిల్లలు టిఫ్అనీ,ఎవెలిన్ మరియు ప్రిస్కిల్ల శర్మ లతో జర్మనీ లో తన పెద్ద ఎస్టేట్ లాంటి రాజమందిరం లో ఆనందంగా జీవిస్తుంది.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: