నంద్యాల ,కాకినాడ ఎలక్షన్ లో ఎం జరిగింది.

చాలా మంది రాజకీయ నాయకులు డబ్బు,అంగ బలం ఉంటేనే ఎన్నికల్లో గెలుస్తాం అని అనుకుంటారు ఇది రాజకీయాల్లో కొంత వరకు విజయాన్ని ఇచ్చాయి అని చెప్పుకోవచ్చు .కానీ రోజులు మారుతున్నాయి మరి మనం మారాలి కదా ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో ఎం జరిగింది.

ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నిక మరియు కాకినాడ కార్పొరేషన్ ఎన్నిక రెండు కూడా సిట్టింగ్ వారిని కాదని ప్రజలు అధికార పార్టీ ని గెలిపించారు. ఒక పార్టీ దేశాన్ని 70 సంవత్సరాలు వరకు పాలించింది ఇంకొక పార్టీ ఇపుడిపుడే ఎదుగుతున్న రాజకియ పార్టీ.

ఇప్పుడున్న రాజకీయాలు ఏ పార్టీ కైనా ప్రజలు అవకాశం ఇస్తే దానిని సద్వినియోగం చేసుకోకపోతే రాబోయే రోజుల్లో ఇంకో సారి అవకాశం ఇచ్చేంత పెద్ద మనస్సు నిజంగా ఓటర్లకి లేదు గత 75 సంవత్సరాలుగా ఎన్నో అబ్బద్దాలు ఇంటూ మోసపోతున్నారు .

మన రాజకీయ నాయకులు అందరికి ఎన్నికలు అనగానే ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇవ్వడం వాటిని అమలు చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా అధికారంలో ఉన్నన్ని రోజులు నియోజక వర్గం కి వెళ్లక కుదిరితే దేశ రాజధాని లేదా రాష్ట్ర రాజధాని లి విలాసవంత మైన జీవితం అనుభవిస్తారు.

ప్రస్తుతం మనం టెక్నాలోజి యుగం లో ఉన్నాం ఏదైనా న్యూస్ కానీ ఎలాంటి సమాచారం ఐనా టీవీ ,సోషల్ మీడియా లో నిమిషాల్లో అందరికి తెలిసి పోతుంది . చాల మంది రాజకీయ నాయకులూ ప్రజా ధనం తో సకల సౌకర్యాలు అనుభవిస్తూ తమ తమ వ్యక్తిగత విషయాలకు ,తమ అనుచరులకు ,తమ బందువులకు సంబందించిన పనులు చేసుకుంటే ప్రజలు ఎవ్వరికైనా సమయం వస్తే సరియైన గుణపాఠం చెప్తారు అనడానికి ఇది ఒక ఉదాహరణ .

ప్రజలు రాజకీయ నాయకులూ ఎదుటి వారిని విమర్శిస్తే ఎప్పుడు నమ్మరు ఎందుకంటే ప్రజలకి వారి జీవితం లో ఎదుగుల ను కోరుకునే పార్టీకే అధికారం ఇస్తారు . ప్రతి రాజకీయ నాయకుడు తాను గెలిస్తే ప్రజలకి ఎం చేస్తాను ,ఎలా చేస్తాను ,ఎందుకు చేస్తాను అందరికి అర్థమయ్యేలా విడమరిచి చెప్తే ఎన్నికలో అవకాశం ఇవ్వొచ్చు.

రోజులు మారాయి రాజకీయనాయలు మీరు మారాలి జనం డబ్బు,మద్యం తో పట్టు వాళ్ళ పిల్లల భవిషత్తు కోసం చాల మంచి పనుల చేస్తే నిజంగానే జనం మనసు గెలుసుకోవచ్చు .

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: