ఫ్యాన్ ఫాలోయింగ్ లేని మన తెలుగు హీరోలు.

మన తెలుగు లో ఫ్యాన్స్ లేని హీరోలు కూడా ఉన్నారు అవునునండి బాబు ఆ సినిమా హీరో లకి ఇప్పటి వరకు సరిగ్గా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా లేదు. సంవత్సరాల నుండి సినిమాల్లో హీరో గ చేస్తూ మనల్ని తమ వైపుకి తిప్పుకొని ఒక సూపర్ హిట్ లో నటించాను అని పించుకోవడానికి సంవత్సరాల నుండి కష్టపడుతున్నారు.అలాంటి హీరోల గురించి మనం ఇప్పుడు తెలుసు కొందాం .

తెలుగు సినిమా పరిశ్రమ కు 75 సంవత్సరాల చరిత్ర ఉంది. దక్షిణ భారత దేశం లో తమిళ సినిమా పరిశ్రమ తర్వాత ఎక్కువ మంది ఆదరించేది మన తెలుగు సినిమా పరిశ్రమనే . భారత దేశ సినిమా పరిశ్రమలో తెలుగు సినిమా పరిశ్రమ 3వ స్థానం లో ఇప్పుడు కొనసాగుతుంది. చాల మంది యువ హీరోలు తెలుగు లో హీరోలు గ రాణించడానికి సంవత్సరాల నుండి కష్టపడుతున్నారు కానీ ఫలితం మాత్రం శూన్యం .

నందమూరి నట వారసుడు తారక రత్న నటన మీద ఇష్టం తో సినిమాల్లో హీరోగా పరిచయం అయ్యాడు. కానీ మనోడు ప్రేక్షకులను అలరించలేక పోయాడు. ప్రస్తుతం హీరో కన్నా విలన్ గ కొన్ని సినిమాల్లో రాబోతున్నాడు.

సూపర్ స్టార్ కృష్ణ సొంత అల్లుడు సుధీర్ బాబు హీరోగా కొన్ని సినిమాలు చేసాడు ఇంతకీ ఆ సినిమాల కి ఏమైంది అంటే మా కన్నా మీకే ఎక్కువ తెలుసు.సుధీర్ బాబును హీరోగా నిలబెట్టడానికి ఇటు మహేష్ బాబు,అటు సూపర్ స్టార్ కృష్ణ తమ వంతు సాయం చేస్తూవచ్చారు.

అల్లుగారి అబ్బాయి శిరీష్ ను హీరోగా పెట్టి అల్లు అరవింద్ దాదాపు చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేసాడు. ఇప్పటి వరకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు స్వయం గ నిర్మించాడు కానీ కన్నా కొడుకు కి ఒక హీరోగా మంచి గుర్తింపు తీసుకు రాలేక పోయాడు.

మనకు తెలిసిన మరో సచిన్ జోషి .ఇతను సినిమా లలో హీరోగా పది సంవత్సరాలు దాటింది కానీ ఎంత వరకు ఒక్క సూపర్ హిట్ కూడా చేయలేదు.తండ్రి సంపాందించిన డబ్బులు ఏంచేయాలో తేలిక తనకున్న సినిమాల పిచ్చి తో అటు బాలీవుడ్ ఇటు తెలుగు సినిమాలో హీరోగా సినిమాలు చేస్తున్నాడు.

తెలుగు లో ప్రిన్స్ పేరు గల సినిమా హీరో ఉన్నాడు చాలా మందికి తెలీదు. ప్రిన్స్ అంటే చాల మంది హీరో మహేష్ బాబు అనుకుంటారు. కాదండి బాబు ప్రిన్స్ పేరు గల హీరో కొన్ని సినిమాల్లో హీరోగా చేసాడు కానీ చాల తక్కువ మందికి తెలుసు. ఈ మధ్య బిగ్ బాస్ పుణ్యమా ఇతను తెలుగు ప్రేక్షకులకు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాడు .

హీరోలుగా చేస్తూ ఎలాంటి ఫాన్స్ ఫాలోయింగ్ లేకుండా ఉన్న మన తెలుగు హీరోలు వీళ్ళే కాకుండా ఇంకా కొంత మంది హీరోలు కూడా వున్నారు .

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: