తెలుగు మాటల రచయిత MVS. హరినాథ రావు ఇక లేరు .

తెలుగు చిత్ర పరిశ్రమ లో మరో విషాదం అలనాటి రచయిత మరియు క్యారెక్టర్ నటుడు MVS .హరినాథ రావు (69) ఒంగోలు లోని తన స్వగృహం లో ఈ రోజు తుది శ్వాస విడిచారు . హరినాథ్ రావు కి ముగ్గురు కూమార్తెలు . 150 సినిమాలకు పైగా మాటలు ,స్క్రీన్ ప్లే రాశారు . ప్రతిఘటన ,ధర్మ చక్రం,అన్న,స్వయం కృషి,భారత నారి,సూత్ర దారులు మరియు అమ్మాయి కాపురం సినిమాలకి హరినాథ రావు ఉత్తమ మాటల రచయితగా నేషనల్ అవార్డు అందుకున్నారు .

మెగా స్టార్ చిరంజీవి నటించిన స్వయం కృషి సినిమా లో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా చాల దగ్గర అయ్యారు .ప్రతిఘటన సినిమా లో ఒక రకమైన విలన్ పాత్రకి మంచి పేరే తెచ్చుకున్నారు . తెలుగు వారికి ఎప్పటి గుర్తుండి పోయే సినిమా లకి మాటలని రాసి హరినాథ్ రావు ఎప్పుడు తెలుగు వారి గుండెల్లో ఉండాలని ఆశిస్తున్నాం .

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: