మహేష్ బాబు ,కొరటాల శివ సినిమా “భరత్ అనే నేను “ఏప్రిల్ 27 ,2018న విడుదల.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అని తెలుసుకోవాలని ప్రతి తెలుగు సినిమా అభిమానికి ఉంటుంది. మహేష్ బాబు స్పైడర్ సినిమా అనుకున్నంత విజయాన్ని ఇవ్వలేదు . మహేష్ బాబు స్పైడర్ సినిమా తో తన మార్కెట్ ని అటు తమిళ మరియు కన్నడ సినిమా పరిశ్రమలో పెంచుకోవాలని అనుకున్నాడు కానీ సినిమా ప్రేక్షకులను అనుకున్నంత అలరించలేక పోయింది . ఏదిఏమైనా మహేష్ దక్షిణ భారత సినిమా పరిశ్రమలో తన కంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.

సూపర్ స్టార్ కృష్ణ తన నటన జీవితం లో తమిళ సినిమా పరిశ్రమలో మంచి పేరు కోసం ఎన్నో సాహసాలు చేసాడు కానీ అనుకున్నంత విజయం పొందలేక పోయాడు . మన ఇండియా లో హిందీ సినిమా పరిశ్రమ తర్వాత తమిళ నాడే అదిపెద్ద సినిమా పరిశ్రమ.

మహేష్ తన తదుపరి సినిమా “భరత్ అనే నేను ” ను వచ్చే సంవత్సరం ఏప్రిల్ 27 న విడుదల చెయ్యాలి అని అనుకుంటున్నారు .కొరటాల శివ ఇంకొక సరి మహేష్ బాబు ను డైరెక్ట్ చేయబోతున్నాడు . ఇంతకూ ముందు తెలుగు ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఇంతకు ముందు మహేష్ బాబు తో “శ్రీమంతుడు” సినిమా తీశాడు .

మహేష్ బాబు ఈసారి సమ్మర్ హాలిడేస్ ను టార్గెట్ చేస్తూ భారీ ఓపెనింగ్స్ కోసం ఈ సినిమా ఏప్రిల్ 27న రిలీస్ చేయబోతున్నాడు . మహేష్ బాబు ఈ సినిమా లో రాజకీయం ప్రాధ్యానత ఉన్న హీరో పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు . 2018 ఏప్రిల్ నాటికీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎలక్షన్ వాతావరణం కనిపించబోతున్న సందర్భంలో మహేష్ సినిమాకి చాలా ప్రాధాన్యత ఉండబోతుంది.

ఈ సినిమాలో బాలీవుడ్ భామ “కీరా అదానీ “మహేష్ పక్కన హీరోయిన్ గ నటించబోతుంది.మహేష్ బాబు ఈ సినిమా తర్వాత దర్శకుడు వంశీ పైడిపల్లి తర్వాత బాహుబలి సృష్టికర్త తెలుగు జక్కన్న రాజమౌళి సినిమాలతో 2020 వరకు బిజీ గా ఉండబోతున్నాడు .

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: