బాహుబలి హీరో ప్రభాస్ పారితోషకం బాలీవుడ్ ని వణికిస్తుంది.

రాజమౌళి దర్శకత్వంలో హీరో ప్రభాస్ బాహుబలి సినిమా తో ఇండియా సినిమా పరిశ్రమలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్ బాహుబలిని హిందీ భాషలో బాలీవుడ్ ఇండస్ట్రీ రిలీజ్ చేసింది. ఇదే నిర్మాణ సంస్థ బాహుబలి సినిమా విజయం తర్వాత హీరో ప్రభాస్ తో హిందీలో సినిమా నిర్మించాలని అనుకుంది .

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ హిందీ లో ఒక భారీ సినిమా కోసం హీరో ప్రభాస్ ని అడగగా మన బాహుబలి హీరో ఏకంగా 20 కోట్ల పారితోషకం అడిగాడు దీనితో కరణ్ జోహార్ ప్రభాస్ తో సినిమా గురించి వెనకడుగు వేసాడు . ప్రభాస్ బాహుబలి రెండు సినిమా కి కలిపి మొత్తం 25 కోట్లు పారితోషకం తీసుకున్నాడు .బాహుబలి సినిమా కోసం హీరో ప్రభాస్ ఏకంగా దాదాపు 5 సంవత్సరాలు వేరే సినిమా లలో నటించలేదు .

కరణ్ జోహార్ ని వివరణ అడగగా బాహుబలి సినిమాలు విజయానికి కారణం దర్శకుడు రాజమౌళి కదా అని సమాధానం ఇచ్చాడు . ప్రభాస్ తన కొత్త సినిమా “సాహు “విజయవంతం అయితే కరణ్ జోహార్ ప్రభాస్ కి 20 కోట్ల పారితోషకంతో భారీ హిందీ సినిమా నిర్మించడానికి సుముఖంగా ఉన్నాడు . ఇదే జరిగితే ఇండియాలో అత్యధిక పారితోషకం అందుకునే హీరో కూడా మన టాలీవుడ్ హీరో ప్రభాస్ సే. ఇప్పటి వరకు అత్యధిక పారితోషకం అందుకున్న హీరోలలో మన తమిళ్ సూపర్ స్టార్ రజిని కాంత్ మొదటి స్థానం లో ఉన్నాడు.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: