టాలీవుడ్ డైరెక్టర్ S.S రాజామౌళి గురించి మీకు తెలియని విషయాలు .

Bahubali S S Rajamouli ఇప్పుడు ఏ సినిమా ఇండీస్ట్రీ లో ఐనా సగటు సినిమా అభిమాని బాహుబలి డైరెక్టర్ ఎవ్వరు అని అడిగితే టక్కున చెప్పే సమాధానం రాజమౌళి . నిజానికి బాహుబలి కన్నా ముందు రాజమౌళి ఒక్క తెలుగు ప్రేక్షకులకే మాత్రమే తెలుసు. బాహుబలి విజయం తర్వాత ఇండియా లో ఉన్న అన్ని సినిమా ఇండస్ట్రీ లో రాజమౌళి దేశం లోనే అత్యుత్తమ డైరెక్టర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు . ఇప్పుడు రాజమౌళి తో కలిసి పని చేయాలి అని ఎంతో మంది సినిమా హీరోలు వేచి చూస్తున్నారు .బాహుబలి తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా తీయబోతున్నారో అని ప్రతి సినిమా అభిమాని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు .Bahubali S S Rajamouli 

రాజమౌళి గురించి 10ఆసక్తికర విషయాలు.

1.రాజమౌళి పూర్తి పేరు కొండూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. కర్ణాటక లోని రాయచూరు జన్మించారు .రాజమౌళి చాల చక్కగా కన్నడ భాషను కూడ మాట్లాడతాడు .
2.రాజమౌళి తండ్రి ఎవరో కాదు బాహుబలి,బజరంగ్ బైజాన్ లాంటి విజయవంతమైన సినిమా లకు కథను అందించిన రచయిత కే. వి.విజయేంద్ర ప్రసాద్ .
3..రాజమౌళి కి మహాభారతంను అద్భుత సినిమాగా తీయాలని చిరకాల కోరిక . ఈ సినిమా కి దాదాపు 10 సంవత్సరాల పైనే పట్టొచ్చు అని స్వయం రాజమౌళి తన మనసులోని మాట చెప్పాడు.
4.ఇండియా సినిమా పరిశ్రమ లో ఓటమిని లేని డైరెక్టర్ గ శంకర్ తర్వాత రాజమౌళి పేరునే చెప్పాలి .
5.రాజమౌళి ఇప్పటి వరకు రెండు సార్లు నేషనల్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు ను అందుకున్నారు. మొదటి సారి ఈగ సినిమా కి రెండవ సారి బాహుబలి కి ఉత్తమ డైరెక్టర్ గ అవార్డు అందుకున్నారు .ఈ మధ్యే అక్కినేని నాగేశ్వర్ రావు అవార్డు కూడా అందుకున్నారు .
6.రాజమౌళి మలయాళ నటుడు మోహన్ లాల్ కి వీరాభిమాని. అవకాశం వస్తే మోహన్ లాల్ తో సినిమా తీయాలి రాజమౌళి కోరిక .
7.జూ ఎన్టీఆర్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ గ నిలబెట్టింది రాజమౌళి . జూ ఎన్టీఆర్ కి స్టూడెంట్ నం 1,సింహాద్రి లాంటి సినిమా విజయాలు అందించారు . రాజమౌళిని మొదట జక్కన్న అని పిలిచింది మన జూ ఎన్టీఆర్ .
8. రాజమౌళి సినిమా లోకి రాక ముందు శాంతి నివాసం అనే తెలుగు సీరియల్ ను డైరెక్ట్ చేసాడు.
9.రాజమౌళి తన భార్య రమా టాలెంట్ గుర్తించి బాహుబలి సినిమాలకి కాస్ట్యూమ్ డిజైన్ చేసి పని అప్పచెప్పాడు.
10.రాజమౌళి మరియు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఇద్దరు కజిన్ బ్రదర్స్.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: