బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నిజమైన దేశభక్తుడు .

 

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నిజమైన దేశభక్తుడు .

మన భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు దాటిన దేశ భక్తి అంటే ఇది అని చెప్పడానికి ఎలాంటి ప్రమాణాలు లేవు. ఇంకా విచిత్రం ఏమిటంటే దేశ భక్తి అంటే ఆగష్టు 15 తారీఖున,జనవరి 26 న లేదా అక్టోబర్ 2 తారీఖున ఒక గంట సమయం వెచ్చించి తనకు నచ్చిన ఉపన్యాసం ఇచ్చి ,నాలుగు స్వీట్స్ పంచడం అని చాల మంది రాజకీయ నాయకులు ,ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఒక సగటు మనిషి కూడా అలాగే అనుకుంటున్నారు .

ఒక మహానుభావుడు ఆనాడే అన్నాడు దేశం అంటే మట్టి కాదోయ్ దేశ మంటే మనుషులోయ్ అని చెప్పారు. మనం కనీసం మన చుట్టు ప్రక్కల వారు ప్రమాదం లో ఉన్న కనీసం సహాయం చేయడానికి కనీసం ప్రయత్నం కూడా చేయడం లేదు.దేశభక్తి అంటే ఇదేనా ఎదుటి మనిషిని కనీసం సహాయం చేయని వారు వీళ్ళ దేశభక్తులు .

బాలీవుడ్ సినిమాలో హీరో నటించే అక్షయ్ కుమార్ తాను నిజమైన దేశ భక్తుడని అని ఇంకొక సరి నిరూపించుకున్నాడు .ఆమధ్య హీరో అక్షయ్ కుమార్ తానే స్వయం గా ఇండియన్ ఆర్మీ వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి ఒక రోజు మొత్తం వాళ్లతో గడిపాడు. దీపావళి సందర్బంగా తానే స్వయంగా 103 మంది విధి నిర్వహణలో ప్రాణాలు అమరులైన జవాన్లను మరియు పోలీసులను గుర్తించి ప్రతి కుటుంబానికి 25,000 రూపాయల చెక్కును మహారాష్ట్ర ఐజీపీ ద్వారా వారి కుటుంబాలకు పంపించాడు . మీరు మీస్థాయిలో దేశ భక్తిని చాటండి.

చివరగా ఒక మాట మిత్రమా మీరు ఈ దేశం కోసం ఎదో ఒక మంచి పని చేయండి కుదిరితే ఒక 500 రూపాయలతో ఒక బిచ్చగాడికి జీవనాధారం చూపగలరు . నా ఈ భారత దేశం లో దేశ భక్తులకు కొదవలేదు .

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: