యాంకర్ సుమ ఆస్తి కొందరి హిరో లనే మించిపోయింది .

తెలుగు చిత్ర పరిశ్రమ బుల్లితెర ప్రముఖ సీనియర్ యాంకర్ సుమ కనకాల గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడంటే నమ్మలేం. దాదాపు 25 సంవత్సరాల నుండి సుమ ముందు వెండితెర మీద చిన్న చిన్న పాత్రలతో సినిమాల్లో నటించి తర్వాత సీరియల్స్ ఇప్పుడు పూర్తిస్థాయి యాంకర్ గా చాలా పాపులర్ పొంది ప్రతి రోజు ఎదో ఓకే ఛానల్ లో సుమ మనల్ని అందరిని ఆనందింపచేస్తుంది.

సుమ కనకాల తన బుల్లి తెర ప్రయాణంలో ఏ యాంకర్ అందుకొనన్ని అవార్డులు అందుకొని తనకంటూ తన కంటూ తెలుగు వారి మనసులో చెరగని ముద్ర వేసుకొని ఇంకా తన బుల్లితెర ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు . ఇటు బుల్లి తెర పై ,అటు సినిమా ఆడియో ఫంక్షన్ లో ,సినిమా సంబందించిన ఎలాంటి ఫంక్షన్లో ఐనా చాలా మంది నిర్మాతలు వాఖ్యతగా ముందుగా కోరుకునేది సుమను మాత్రమే.

సుమ వ్యాఖ్యాత గానే కాక సమయానికి అనుగుణంగా ప్రేక్షకులకు మెప్పించడానికి తన మంచి మాట కారి తనంతో అక్కడ ఉన్న ఎలాంటి పరిస్థితి ఐనా తనకు అనుగుణంగా మార్చుకునే నేర్పు ఉంది. సుమ కు స్క్రిప్ట్ లో లేక పోయిన అక్కడ సందర్భాన్ని బట్టి మాట్లాడడం వెన్నెతో పెట్టిన విద్య. అలాగే తాను పని చేసిన వారితో చాల స్నేహంగా ఉండడం వలన సుమకి తెలుగు సినిమా పరిశ్రమలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు సాధించింది.

సుమ ఫ్యామిలీ.

నిజానికి సుమ మన తెలుగు అమ్మాయి కాదు .సుమ 22 మార్చ్ 1974 న కేరళలో జన్మించింది . ఆమె తల్లి పి విమల తండ్రి పి న్ కుట్టి . సుమ తండ్రి వృత్తి రీత్యా హైదరాబాద్ లో ఉండడం వలన తాను చేసిన సినిమా ప్రయత్నాలు కలిసొచ్చి మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు వచ్చాయి . తర్వాత మెల్లగా పూర్తి స్థాయి యాంకర్ గా మారి ఇప్పుడు తెలుగు లో అత్యధిక పారితోషకం అందుకుంటున్న యాంకర్ సుమనే . తెలుగు లో కొందరి హీరో ,హీరోయిన్ల కంటే ఎప్పుడు చాల బిజీ గా ఉంటుంది.

సుమ తెలుగు సినిమా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజీవ్ కనకాల ను ప్రేమించి తర్వాత పెద్దల అంగీకారం తో ఫిబ్రవరి 10న ,1999 లో వివాహం చేసుకుంది . వీరిద్దరికి ఒక కొడుకు రోషన్,ఒక కూతురు మనస్విని తో కలిసి ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు . M Com చదివిన సుమ కనకాల దాదాపు అయిదు (తెలుగు,హిందీ,ఇంగ్లీష్,తమిళ్ మరియు మలయాళం ) భాషల్లో చాల అనర్గళంగా మాట్లాడగలదు .

సుమ కనకాల తన బుల్లి తెర ,వెండితెర సంబందించిన వ్యాఖ్యానం లో తెలుగు హిరో ,హిరోయిన్ కంటే చాల ఎక్కువే సంపాదిస్తుంది . సుమ ప్రస్తుతం ఉంటున్న ఇల్లు సకల సదుపాయాలతో ఒక చిన్న పాటి ఇంద్ర భవనంలా ఉంటుంది . సుమ ఈ మధ్యే సాయి ధరమ్ తేజ్ హీరో గ వచ్చినా విన్నర్ సినిమా లో ఒక పాటని పాడి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.

సుమ తాను చేసే టీవీ షోలో కి ఒక రోజుకి దాదాపుగా అన్ని కలిపి 80,000 వరకు తీసుకుంటుంది . ఒక్క ఆదివారం తప్ప మిగతా రోజుల్లో ఆ షో లు నిర్విరామంగా టెలికాస్ట్ అవుతు ఉంటాయి . సుమ ఏదైనా ఫంక్షన్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి టీవీ షోల కంటే ఎక్కువే పారితోషకం తీసుకుంటుంది. దాదాపుగా అన్ని కలిపి సుమ నెలసరి ఆదాయం 30 లక్షల పై మాటే .అంటే సంవత్సరానికి 3.60 కోట్లు అన్న మాట.

ఏ హీరోయిన్ కు అయినా తన సినిమాలు హిట్ అయితేనే అడిగినంత పారితోషకం ఇస్తారు మరి సుమ కి అలాంటి భయం ఏమి లేదు .డేట్స్ మరియు టైం కుదరక సుమ చాల సినిమా ఫంక్షన్స్ లో వ్యాఖ్యాతగా వచ్చిన అవకాశాలను వదులు కోవాల్సి వస్తుంది దీన్ని బట్టి చూస్తే సుమ కి ఎంత డిమాండ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు .

ఈ మద్యే సుమ తన సొంత టీవీ షో ల నిర్మాణ సంస్థ ను స్థాపించి వాటిలోంచి ఇంకా డబ్బును సంపాదించడం మొదలు పెట్టింది .చూడాలి ముందు ముందు ఎలాగా ఉంటుందో.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: