అర్జున్ రెడ్డి సినిమా ప్రొడ్యూసర్ కి జాక్ పాట్ తగిలింది.

విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా థియేటర్ లో కన్నా జనం నోటిలో ఎక్కువగా ఆడుతుందని అనే చెప్పాలి. నిజానికి అర్జున్ రెడ్డి సినిమా ఎలాంటి అంచనాలతో రిలీజ్ కాలేదు కానీ రిలీజ్ ఐన పది రోజుల తర్వాత సినిమా పెద్ద విజయం సాధించింది అని చెప్పాలి . అర్జున్ రెడ్డి సినిమా ఇప్పటికి పది రోజులు దాటినా కలెక్షన్లు ఏకంగా 30 కోట్లు పైనే వసూలు చేసింది.

అర్జున్ రెడ్డి సినిమా విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం లో నిర్మాత ప్రణయ్ వంగ కేవలం 5 కోట్లతో నిర్మించాడు. దాదాపు అందరు నటులు ఈ సినిమాకి అంత పెద్దగా పారితోషకం అందుకోలేదు . ఈ సినిమా ఇప్పటికి పెట్టుబడి కన్నా 6 నుండి 7 రేట్లు సంపాదించి పెట్టింది అని చెప్పాలి.

అదే బిజినెస్ రిటర్న్స్ పరంగా అర్జున్ రెడ్డ్డి బాహుబలి కన్నా ఎక్కువే ప్రొడ్యూసర్ కి కలిసొచ్చింది అని చెప్పాలి .ఇప్పుడు ఉన్న సినిమాలు కనీసం పెట్టుబడిని కూడా రాబట్టలేక పోతున్నాయి . కలెక్షన్స్ పరంగా అర్జున్ రెడ్డి సినిమా చాల పెద్ద హిట్ అని చెప్పాలి. ఏది ఏమైనా సినిమా ప్రొడ్యూసర్ ప్రణయ్ మంచి జాక్ పాట్ నే కొట్టేసాడు .

ఏది ఏమైనా ఈ సినిమా లో నటించిన నటులకు మంచి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చే అవకాశం ఉంది . చిన్న సినిమా ఎంత పెద్ద విజయం సాధించడం లో అందరి పాత్ర ఉంది కాబట్టి మిగతా ప్రొడ్యూసర్స్ ఇలాంటి కాంబినేషన్ ను రిపీట్ చేసి జనం లోకి వెళ్లి మరిన్ని విజయాలు అందుకునే అవకాశం ఉంది.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: